: ఈ సారి అజంఖాన్ మద్దతుదారల వంతు
ఉత్తరప్రదేశ్ మంత్రి అజంఖాన్ వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో, ఆయన ప్రచారంలో పాల్గొనరాదని ఈసీ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన మద్దతు దారుల వంతు వచ్చింది. అజంఖాన్ పై నిషేధంతో ఆయన మద్దతుదారులు ఆందోళనకు దిగారు. 10 మంది యువకులు మంగళవారం రాత్రి ఈసీ దిష్టిబొమ్మను దహనం చేశారు. దీంతో సంభాల్ పోలీస్ స్టేషన్ లో ఇక్రామ్ పప్పు సహా మరో 8 మందిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.