: రాహుల్ చాక్లెట్ వ్యాఖ్యలకు బీజేపీ బదులు
బీజేపీ అభివృద్ధి అంతా చాక్లెట్ చందం అన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. దీటుగా బదులిచ్చింది. తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికే రాహుల్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని బీజేపీ అధికార ప్రతినిధి ముక్తార్ అబ్బాస్ నఖ్వి అన్నారు. గత పదేళ్లలో ఏం చేశారో దేశ ప్రజలకు చెప్పాలని సూచించారు. అది చెప్పకుండా రాహుల్ ఇలాంటి ప్రకటనలతో ప్రజలను వెర్రోళ్లను చేస్తున్నారని ధ్వజమెత్తారు. అవినీతి, ధరల పెరుగుదల, నిరుద్యోగం, ఉగ్రవాదానికి చెక్ పెట్టకపోగా, యూపీఏ పాలనలో అవి పెరిగిపోయాయన్నారు. కాంగ్రెస్ కోటలో అవినీతి ఆస్తిపంజరాలు దాగున్నాయని, అవి బయటకు వస్తే కాంగ్రెస్ పని ఖతమని వ్యాఖ్యానించారు.