: అప్పుడూ ఇప్పుడూ, మే 16... కలిసొస్తుందా?
గత సార్వత్రిక ఎన్నికల ఫలితాలను మే 16వ తేదీన లెక్కించారు. కాకతాళీయంగా ఈసారి కూడా మే 16నే ఓట్ల లెక్కింపు జరగనుంది. 2009 మాదిరి అప్పుడూ, ఇప్పుడూ... అదే తేదీన తమ జాతకాలు... అదృష్టాలు తేలనున్నాయని అభ్యర్థులు అంటున్నారు. గత ఎన్నికల్లో గెలిచి ఈసారి బరిలోకి దిగిన అభ్యర్థులు గత ఎన్నికల మాదిరిగానే మే 16న తమకు తీపి కబురు వినిపిస్తుందేమోనన్న ఆశతో ఉన్నారు. అయితే, ఆరోజు ఎలాంటి ఫలితాలు వెలువడుతాయోనని ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.