: జయసుధ ఈసారి జయకేతనం ఎగురవేస్తారా?


సహజ నటి అనగానే తక్కున ఠక్కున గుర్తొచ్చేది జయసుధ. తన నటనతో ప్రేక్షకుల్ని మెప్పించిన ఆమె రాజకీయాల్లోకి ప్రవేశించి గత ఎన్నికల్లో విజయం సాధించారు. సికింద్రాబాదు నియోజకవర్గం నుంచి మరోసారి పోటీ చేస్తోన్న జయసుధకు ఇప్పుడు అక్కడ ఎదురుగాలి వీస్తోందని సమాచారం.

2009 ఎన్నికల్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ ప్రోత్సాహంతో వెండితెర నుంచి ఆమె రాజకీయ ఆరంగేట్రం చేశారు. ఆమె గత ఎన్నికల్లో ఘనవిజయం సాధించారు. అయితే ఈ అయిదేళ్లలో జయసుధ పార్టీ సహచరులతోనూ, కార్యకర్తలతోనూ అంటీ ముట్టనట్టు వ్యవహరించారని విమర్శలు వినవస్తున్నాయి. అంతేకాకుండా నియోజకవర్గానికి జయసుధ చేసిందేమీ లేదని స్థానికులు పెదవి విరుస్తున్నారు.

జయసుధ ఈసారి లోక్ సభ సీటుపై కన్నేసినా... కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆమెకు సికింద్రాబాదు అసెంబ్లీ టికెట్ కేటాయించింది. దాంతో ఆమె ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈసారి సికింద్రాబాదు నుంచి త్రిముఖ పోటీ ఉండటంతో జయసుధ ఈసారి జయకేతనం ఎగురవేస్తారా? అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

  • Loading...

More Telugu News