: సెట్ టాప్ బాక్సుల గడువు పొడిగించాలని కేంద్రానికి సీఎం విజ్ఞప్తి


సెట్ టాప్ బాక్సుల విషయంలో విధించిన గడువును పొడిగించాలని కోరుతూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ కేంద్రానికి లేఖ రాశారు. హైదరాబాద్, విశాఖపట్టణంలో నేటితో ముగియనున్న గడువును మరో నెల పాటు పొడిగించాలని లేఖలో సీఎం కోరారు. 

వాస్తవానికి ఈ రెండు పట్టణాలలో కేబుల్ ప్రసారాల డిజిటలైజేషన్ గడువు నేటితో ముగియనుంది. అంటే ప్రతీ వినియోగదారుడు కేబుల్ ప్రసారాలను వీక్షించాలనుకుంటే తప్పనిసరిగా సెట్ టాప్ బాక్సులు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అయితే, ఇప్పటికీ చాలా మంది సెట్ టాప్ బాక్సులు కొనుగోలు చేయలేదు. మార్కెట్ లో సరిపడా అందుబాటులో లేవు. ఈ నేపథ్యంలో గడువు పెంచాలంటూ ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. 

  • Loading...

More Telugu News