: మగాళ్లు ఎందుకు తక్కువ ఏడుస్తారు?
మగాళ్లు సాధారణంగా ఎందుకు తక్కువగా ఏడుస్తారు? ఏడ్చే మగాడ్ని నమ్మొద్దన్నారనా? లేక ఏరా ఆడదానిలా ఏడుస్తున్నావేంటి? అనడం వల్లా? ఇంతకీ మగాడి ఏడుపు వెనక అసలు కథ ఏంటి? మగాడి ఏడుపుని సమాజం తీవ్రంగా వ్యతిరేకించడం వల్ల అది నిబంధనలా మారడం ఒక కారణం. కాగా, సైంటిఫికల్ గా ఆడవాళ్లకు ఎమోషన్స్ ఎక్కువ. ఆడవారి కంటే మగవారికి ఎమోషన్స్ కాస్త తక్కువే. దీనికి కారణం వారి హార్మోన్ల ప్రభావం.
స్త్రీలలో లెఫ్ట్ (లాజిక్) బ్రెయిన్ కు రైట్ (ఎమోషన్స్) బ్రెయిన్ తో గాఢమైన సంబంధాలు ఉంటాయని సైకియాట్రిస్టులు చెబుతున్నారు. మగాళ్లలో బ్రెయిన్ రెండు భాగాల మధ్య సంబంధాలు సమన్వయం కాకపోవడం వల్ల భావోద్వేగాలకు గురికారని సైకియాట్రిస్టులు చెబుతున్నారు. అందుకే మగాళ్లు తక్కువగా ఏడుస్తారు. ఆడవాళ్లు తొందరగా భావోద్వేగానికి లోనవుతారు.