: బీజేపీ వన్ మ్యాన్ షో: ప్రియాంక పంచ్
తమ్ముడు వరుణ్ పై విమర్శల దాడి తర్వాత కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ కుమార్తె ప్రియాంకా వాద్రా బీజేపీ ప్రధాని అభ్యర్థిని విమర్శలకు లక్ష్యంగా చేసుకున్నారు. బీజేపీ వన్ మ్యాన్ షో(ఒకే మనిషి ఆడుతున్న ఆట)గా అభివర్ణించారు. ప్రస్తుత ఎన్నికలు సిద్ధాంతాలపై జరుగుతున్నవిగా ఆమె పేర్కొన్నారు. ప్రజలను శక్తిమంతులను చేయడమే కాంగ్రెస్ సిద్ధాంతమని, బీజేపీ సిద్ధాంతం ఒకే వ్యక్తి నిర్ణయాలు తీసుకునేదంటూ మోడీని విమర్శించారు. ఉత్తరప్రదేశ్ లో తన తల్లి సోనియా పోటీ చేస్తున్న రాయ్ బరేలీలో ఆమె ఈ రోజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తాము దేశాన్ని ఐక్యంగా ఉంచడం కోసం పని చేస్తుంటే బీజేపీ దేశాన్ని విభజిస్తోందని మండిపడ్డారు.