: సుబ్రహ్మణ్యస్వామిపై కేసు నమోదు చేయండి: ఈసీకి సిబాల్ విజ్ఞప్తి
బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి, కేంద్రమంత్రి కపిల్ సిబాల్ మధ్య మాటల యుద్ధం కోటలు దాటి ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకునే వరకు వచ్చింది. ఈ క్రమంలో ఆయనపై కేసు నమోదు చేయాలంటూ ఎన్నికల సంఘాన్ని సిబాల్ కోరారు. ఉద్దేశపూర్వకంగానే సిబాల్ తన భార్య పేరుపై ఉన్న కంపెనీల వివరాలను ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొనలేదంటూ రెండు రోజుల కిందట (శనివారం) స్వామి ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ వ్యాఖ్యలను ఖండించిన సిబాల్ తిరిగి ఆయనపైనే తాజాగా ఫిర్యాదుకు వెళ్లారు. అటు ట్విట్టర్ లో కూడా వీరిద్దరి మాటల దాడి కొనసాగుతోంది.