: పవన్ కల్యాణ్ తో ఆశావహుల చర్చలు
సినీ నటుడు, జనసేన పార్టీ అధినేతకు టీడీపీ, బీజేపీలో మంచి డిమాండ్ ఉంది. ఆయన మద్దతిస్తే సీటు గ్యారంటీ అని ప్రచారంలో ఉండడంతో, పలువురు ఆయనను కలుస్తున్నారు. అలాగే లోక్ సభ బరిలో స్వతంత్ర అభ్యర్థులుగా నిలవాలనుకుంటున్నవారు కూడా ఆయన చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఆయన మద్దతిస్తే లోక్ సభ అభ్యర్థులుగా నిలుస్తామంటున్నారు. దీంతో తమకు మద్దతు ప్రకటించాల్సిందిగా ఆయనను కోరుతున్నారు. పవన్ కల్యాణ్ మద్దతిస్తే టీడీపీ, బీజేపీ అభ్యర్థులకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయని, టీడీపీ ఓటు బ్యాంకు చీలిపోతుందని అభ్యర్థులు అందోళన చెందుతున్నారు.