: జగన్ ప్రకటించిన పథకాలే నన్ను గెలిపిస్తాయి: సామాన్య కిరణ్


వైఎస్ రాజశేఖరరెడ్డి సంక్షేమ పథకాలే తనకు రాజకీయ ప్రేరణ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు పార్లమెంటు అభ్యర్థి సామాన్య కిరణ్ అన్నారు. వైఎస్ హయాంలో ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ వంటి సంక్షేమ పథకాలు ప్రతి గడపకూ దక్కాయని సామాన్య కిరణ్ తెలిపారు. చిత్తూరు జిల్లాతో తనకు చిన్ననాటి నుంచి అనుబంధం ఉందని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. జగన్ ప్రకటించిన సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News