: 121 లోక్ సభ స్థానాల్లో రేపు పోలింగ్
12 రాష్ట్రాలలోని 121 లోక్ సభ స్థానాలకు గురువారం పోలింగ్ జరగబోతోంది. అలాగే ఒడిశాలోని మిగిలిన శాసనసభ స్థానాలకు కూడా ఓటింగ్ జరగనుంది. కర్ణాటకలోని మొత్తం 28 లోక్ సభ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ పూర్తి కానుంది. రాజస్థాన్ లో 20, మహారాష్ట్రలో 19, ఉత్తరప్రదేశ్ లో 11, ఒడిశాలో 11, మధ్యప్రదేశ్ లో 10, బీహార్లో 7, జార్ఖండ్ లో 6, పశ్చిమబెంగాల్లో 4, ఛత్తీస్ గఢ్ లో 3, జమ్మూ కాశ్మీర్, మణిపూర్ లో ఒక్కో స్థానానికి పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున భద్రతను ఏర్పాటు చేశారు.