: సుప్రీంకోర్టులో శ్రీనివాసన్ కు చుక్కెదురు
బీసీసీఐ అధ్యక్షుడిగా తనను కొనసాగించేందుకు అనుమతివ్వాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఎన్.శ్రీనివాసన్ కు నిరాశే మిగిలింది. ఈ మేరకు నిన్న (మంగళవారం) ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్ పై నేడు విచారణ చేపట్టిన కోర్టు.. ఐపీఎల్ బెట్టింగ్, స్పాట్ ఫిక్సింగ్ స్కాంలో జస్టిస్ ముకుల్ ముద్గల్ కమిటి సమర్పించిన నివేదికలో శ్రీని పేరుందని, ఆయన సహా 13మందిపై తీవ్ర అభియోగాలు పేర్కొన్నట్లు తెలిపింది. అలాంటప్పుడు విచారణ నుంచి శ్రీనివాసన్ ను తప్పించలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇలాంటి సమయంలో అభియోగాలపై కళ్లు మూసుకుని ఉండలేమని వ్యాఖ్యానించింది. ఈ కేసులో దర్యాప్తు ఎలా నిర్వహించాలో బీసీసీఐ, శ్రీనివాసనే చెప్పాలని అడిగింది.