: అన్న కారణంగా భార్యను చంపిన తమ్ముడు
వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో కట్టుకున్న భార్యను కడతేర్చాడో కసాయి. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం ముద్దాడలో దారుణం చోటు చేసుకుంది. భార్యాభర్తలైన అసిరి పోలి, అతని భార్య కుమారి మధ్య ఇదే విషయంపై రోజు వాగ్వాదం చోటుచేసుకునేది. ఎప్పట్లాగే వాగ్వాదం పెరగడంతో కోపం పట్టలేని పోలి, కుమారిని విచక్షణా రహితంగా పొడిచి చంపేసి పారిపోయాడు. కుమారిపై పోలి అన్న లేనిపోని పుకార్లు రేపి తమ్ముడి చెవిలో నూరిపోసేవాడని, అతని కారణంగా కుమారిపై అనుమానం పెంచుకున్న పోలి చంపేశాడని స్థానికులు చెబుతున్నారు. వారి ఇద్దరు బిడ్డలు అనాధలుగా మిగిలారు.