: కామ్రేడ్ల ఖిల్లాలో నారాయణ జోరుగా ప్రచారం
కామ్రేడ్లకు ఒకప్పుడు కంచుకోటగా ఉన్న ఖమ్మం జిల్లాలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఖమ్మం లోక్ సభ స్థానానికి ఆయన పోటీ పడుతున్న విషయం తెలిసిందే. దీంతో ఖమ్మం లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని సత్తుపల్లి, అశ్వారావుపేట, మధిర శాసనసభ నియోజకవర్గాల్లో ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ రోజు ఖమ్మం పట్టణంలోని మునిసిపల్ కార్మికులను కలసి ఓట్లు అభ్యర్థించారు. తనను గెలిపిస్తే కార్మికుల సమస్యల పరిష్కారానికి పనిచేస్తానని హామీ ఇచ్చారు.