: అసోంలో రైలు ప్రమాదం... 50 మందికి గాయాలు
అసోంలో ఈ తెల్లవారుజుామున ఓ ప్రయాణికుల రైలు ప్రమాదానికి గురైంది. దిమాపూర్-కామాఖ్య రైలు అంజూరి స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 50 మంది ప్రయాణికులకు గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. 17 మందికి తీవ్ర గాయాలు కాగా, వారిని గౌహతిలోని మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. మిగిలిని వారికి స్వల్ప గాయాలు కాగా, సమీపంలోని ఆస్పత్రిలో ప్రాథమిక వైద్యం చేసి పంపించినట్లు తెలిపారు. సీనియర్ రైల్వే అధికారులు తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.