: తెలంగాణలోని ఐదు జిల్లాల్లో టీఆర్ఎస్ ఉనికే లేదు: డీఎస్
కేసీఆర్ లా తాను దిగజారి మాట్లాడలేనని మాజీ పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ చెప్పారు. కేవలం సీఎం కావాలన్న ఆకాంక్షతోనే టీఆర్ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేయలేదని ఆరోపించారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని ప్రకటించిన కేసీఆర్... ఇప్పుడు మాటమార్చడం ఆయన దొరతనానికి, అహంకారానికి నిదర్శనమని చెప్పారు. దళితుడు సీఎం అయితే తెలంగాణ పునర్నిర్మాణం జరగదని కేసీఆర్ అంటున్నాడని తెలిపారు. తెలంగాణలోని ఐదు జిల్లాల్లో టీఆర్ఎస్ ఉనికే లేదని... అలాంటప్పుడు టీఆర్ఎస్ అధికారంలోకి ఎలా వస్తుందని ప్రశ్నించారు.