: వానర బాలుడు... 12 అంగుళాల తోక!
వానరాలకు తోకలు ఉంటాయి. కానీ మనిషికి కూడా తోకలుంటే? ఉత్తరప్రదేశ్ లో ఓ బాలుడికి నిజంగానే తోక ఉంది. దాని పొడవు 12 అంగుళాలు. నిజమాపూర్ కు చెందిన ఆరేళ్ల అమర్ సింగ్ అనే బాలుడికి వెనుక వైపు వీపు కింద, సరిగ్గా నడుముపై వెంట్రుకలు గుబురుగా పెరుగుతున్నాయి. వాటిని కుటుంబ సభ్యులు జడవేసి తోకగా మలిచారు. పుట్టినప్పటి నుంచి వెంట్రుకలు ఉన్నాయని, అవి పెరుగుతూ వస్తున్నాయని, దీన్ని దేవుడి వరంగా భావిస్తున్నట్లు ఆ బాలుడి కుటుంబ సభ్యులు అంటున్నారు. ఈ సమస్యను వైద్య పరిభాషలో స్పైనా బిఫిడాగా పేర్కొంటారు. వెన్నుపూస దగ్గర ఎముకల నిర్మాణం సరిగ్గా జరగని సందర్భాల్లో ఇలా వెంట్రుకలు వస్తాయట. సర్జరీ ద్వారా వాటిని తొలగించుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.