: సీమాంధ్రలో 160 స్థానాలు గెలుచుకోవడం ఖాయం: నారా లోకేష్
యువప్రభంజనం యాత్రతో టీడీపీ తరపున ప్రచారాన్ని చేపట్టిన టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు నారా లోకేష్ మరోసారి వైఎస్సార్సీపీపై విమర్శలు గుప్పించారు. వైకాపా మేనిఫెస్టోలో కొత్తదనం ఏమీ లేదని... టీడీపీ మేనిఫెస్టో కవర్ పేజీని మార్చి తమ మేనిఫెస్టోగా చెప్పుకుంటున్నారని ఆరోపించారు. ఈ రోజు ఆయన నెల్లూరులో ప్రచారం కొనసాగిస్తున్నారు. సీమాంధ్రలో టీడీపీ, బీజేపీల కూటమి 160 సీట్లను గెలుచుకుని అఖండమైన విజయాన్ని సాధిస్తుందని చెప్పారు. మోడీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు ఒకే వేదికపైకి రానుండటంతో... సీమాంధ్రలో ప్రతిపక్షం కూడా ఉండని ఫలితాలు వస్తాయని జోస్యం చెప్పారు.