: నేటి నుంచే ఐపీఎల్-7... తొలిసారి భారత్ కు దూరంగా...


అంతులేని వినోదాన్ని అందించే ఐపీఎల్ తాజా సీజన్ ఐపీఎల్-7 నేటి నుంచి సందడి చేయనుంది. అయితే తొలిసారి భారత్ కు దూరంగా ఎడారి దేశం యూఏఈలో ఈ టోర్నీ జరగబోతోంది. దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో, టోర్నీని యూఏఈకి తరలించారు. మలి దశ మ్యాచ్ లు మాత్రం భారత్ లో జరుగుతాయి. ఐపీఎల్-7తో ఏడు వారాలపాటు క్రికెట్ అభిమానులకు అంతులేని వినోదం అందనుంది.

టోర్నీ తొలి మ్యాచ్ లో ముంబై ఇండియన్స్, కోల్ కతా నైట్ రైడర్స్ జట్లు తలపడనున్నాయి. కోల్ కతాపై ముంబైకి మెరుగైన రికార్డు ఉంది. గతంలో ఈ రెండు జట్లు 12 సార్లు తలపడగా 10 సార్లు ముంబై గెలిచింది.

  • Loading...

More Telugu News