: పయ్యావుల కేశవ్ గోడౌన్ల నుంచి రూ.20 కోట్ల సరుకుల సీజ్
టీడీపీ నేత పయ్యావుల కేశవ్ కు చెందిన గోడౌన్లలో విజిలెన్స్ అధికారులు ఈ ఉదయం తనిఖీలు నిర్వహించారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో ఆయనకు చెందిన గోడౌన్లలో అక్రమంగా నిల్వ ఉంచిన శనగలు, ధనియాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.20కోట్లు ఉంటుందని అంచనా. విజిలెన్స్ అధికారులు జిల్లాలోని ఇతర ప్రాంతాల్లోనూ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల సమయంలో అధికారులు ఇలా తనిఖీలు నిర్వహించి, పయ్యావుల కేశవ్ కు చెందిన సరుకులను స్వాధీనం చేసుకోవడం స్థానికంగా చర్చనీయాంశం అయింది.