: నగలు దొంగిలించిన కన్నడ టీవీ నటి


టీవీ సీరియల్స్ లో నటించినందుకు ఇచ్చే పారితోషికం సరిపోలేదేమో? ఓ కన్నడ నటి చోరీకి పాల్పడింది. అదీ తన సహ నటి ఇంట్లో. మాంగల్య, రంగోలి తదితర సీరియల్స్ లో నటించిన సుజాత అనే నటిని తాజాగా బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. గతేడాది సుజాత తన తోటి నటి, స్నేహితురాలు కూడా అయిన కవన ఇంట్లో 1.75 లక్షల రూపాయల విలువైన నగలను తస్కరించింది. కవన ఫిర్యాదుతో ఎట్టకేలకు సుజాతే ఆ చోరీ చేసినట్లు తేల్చిన పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. విచారణలో తానే ఆ నగలను దొంగిలించినట్లు ఆమె ఒప్పుకుంది.

  • Loading...

More Telugu News