: నేడు మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్న కేసీఆర్
ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దూసుకుపోతున్నారు. ఈ రోజు మహబూబ్ నగర్ జిల్లాలోని వనపర్తి, మహబూబ్ నగర్ లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. సాయంత్రం 5 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్ లో వనపర్తి చేరుకుని బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం జిల్లా కేంద్రం మహబూబ్ నగర్ చేరుకుని బహిరంగసభలో పాల్గొంటారు.