: మణప్పురం సంస్థకు చెందిన రూ.15 కోట్ల విలువైన బంగారం స్వాధీనం
అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం చెక్ పోస్టు వద్ద పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో రూ.15 కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మణప్పురం ఫైనాన్స్ సంస్థ కు చెందిన ఈ బంగారాన్ని సరైన పత్రాలు లేకుండా తరలిస్తుండటంతో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.