: రేపు పవన్ ను కలసిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తా: పొట్లూరి వరప్రసాద్
విజయవాడ లోక్ సభ సీటును తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు కేశినేని నానికి ఖరారు చేయడంతో ఆ స్థానాన్ని ఆశించిన పొట్లూరి వరప్రసాద్ స్పందించారు. రేపు పవన్ ను కలసిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని ఆయన అన్నారు. పవన్ బాటలో నడుస్తానని తెలిపారు. అయితే పొట్లూరి అనుచరులు మాత్రం 'నాని'ని ఓడించటానికి శాయశక్తుల ప్రయత్నిస్తామని ఉద్వేగంగా చెప్పారు. కేశినేనిని పార్లమెంట్ గేటు కూడా తాకనివ్వమన్నారు. వరప్రసాద్ ఇండిపెండెంట్ గా పోటీ చేసే అంశంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.