: గులాబీ కండువా కప్పుకున్న వారందరూ ఉద్యమకారులే: కవిత
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ తరపున బరిలో దిగిన కవిత ఇవాళ జరిగిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. నిజామాబాదులో ఆమె మాట్లాడుతూ టీఆర్ఎస్ లో ఉన్నవారందరూ ప్రజల కోసం అవసరమైనప్పుడల్లా రాజీనామా చేసిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. గులాబీ కండువా కప్పుకున్న వారు రాజకీయ నేతలు కాదని ఆమె అన్నారు. వారిని ఉద్యమకారులుగా ఆమె అభివర్ణించారు. తెలంగాణ ఉద్యమంలో ప్రజలతో భుజం భుజం కలిపి పనిచేసినవారే టీఆర్ఎస్ వాదులని ఆమె అన్నారు. ఈసారి ఎన్నికల్లో లోక్ సభకు, శాసనసభకు టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాల్సిందిగా ఆమె ప్రజలను కోరారు.