: ఇక, కేసీఆర్ ‘మూడో’ దుకాణం తెరిచారు: పొంగులేటి


పిట్టల దొరల మాటలు, నక్కజిత్తుల వ్యవహారంతో ఇన్నాళ్లు మోసం చేసిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పుడు మూడో కూటమి పేరుతో కొత్త దుకాణం తెరుస్తున్నాడని తెలంగాణ పీసీసీ కార్యదర్శి పొంగులేటి సుధాకర్ రెడ్డి ఆరోపించారు. కరీంనగర్, వరంగల్ జిల్లా హన్మకొండలలో వేర్వేరుగా ఆయన మీడియాతో మాట్లాడారు. 2009లో మహాకూటమిగా ఏర్పడి ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్... ఫలితాలు రాకముందే లూథియానాకు వెళ్లి బీజేపీతో చేతులు కలపడాన్ని మరచిపోవద్దన్నారు. ఉద్యమంలో చెమటోడ్చిన వారిని కాదని, కాంట్రాక్టర్లు, డబ్బులు వెదజల్లే వారికి సీట్లిచ్చారని ఆరోపించారు. ఆచరణ సాధ్యం కాని హామీలతో మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.

  • Loading...

More Telugu News