: కరుణానిధి సవాల్ కు జయలలిత ప్రతి సవాలు


లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ తమిళనాట మాటల తూటాలు పేలుతున్నాయి. కావేరీ నదీ జలాల వివాదంపై డీఎంకే అధినేత కరుణానిధి విసిరిన సవాలును అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత స్వీకరించానన్నారు. ఎన్నికల తరువాత నిర్వహించే అసెంబ్లీ సమావేశాల్లో కావేరి అంశంపై చర్చించేందుకు సిద్ధమని తెలిపారు. తనతో నేరుగా చర్చలో పాల్గొనేందుకు కరుణానిధి సిద్ధమా? అని ఆమె ప్రతి సవాలు విసిరారు. కరుణానిధే చర్చకు రావాలని, ఆయన తరపున ఎవరినీ పంపేందుకు వీలు లేదని ఆమె నిబంధన విధించారు. దీంతో తమిళనాట ఎన్నికల సమరం మరింత రంజుగా మారింది.

  • Loading...

More Telugu News