: టీడీపీ కార్యకర్తలపై చంద్రబాబు ఆగ్రహం
తూర్పుగోదావరి జిల్లా బొమ్మూరులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న చంద్రబాబుకు సొంత పార్టీ నుంచే చుక్కెదురైంది. బొమ్మూరులో చంద్రబాబు ప్రసంగాన్ని టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరికి రాజమండ్రి రూరల్ స్థానాన్ని కేటాయించవద్దంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. దాంతో అసహనాన్ని గురైన చంద్రబాబు, వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.