: తిరుపతి ఎంపీ చింతా మోహన్ కు ఈసీ నోటీసులు
తిరుపతి ఎంపీ చింతా మోహన్ కు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. సోమవారం రాత్రి గూడూరులో జరిగిన తిరుపతి ఎంపీ చింతా మోహన్ సమావేశంపై ఎన్నికల సంఘం ఆరా తీసింది. ఈ మేరకు చింతా మోహన్ కు ఈసీ నోటీసులు పంపింది. మరోసారి ఇలాంటి కార్యక్రమాలు చేపడితే గుర్తింపు రద్దు చేస్తామని ఈసీ హెచ్చరించింది.