: ప్రియాంకపై వ్యాఖ్యలకు నిరసన... సుబ్రహ్మణ్యస్వామి ఇంటి ముట్టడి
ప్రియాంక గాంధీపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి ఢిల్లీలోని ఇంటిని కాంగ్రెస్ కార్యకర్తలు ముట్టడించారు. ఇంటి గేటును ధ్వసం చేసి, ఆందోళన చేపట్టారు. వివరాల్లోకి వెళితే, దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ గర్వించదగ్గ కుమార్తె ప్రియాంక కాదని సుబ్రహ్మణ్యస్వామి విమర్శించారు. తండ్రిని హత్య చేసిన ఖైదీలను కలవడానికి జైలుకు వెళ్లి, వారిని విడుదల చేయాలని ప్రియాంక కోరడాన్ని ఆయన తప్పుబట్టారు. అంతేకాకుండా ప్రియాంకకు విపరీతంగా మద్యం సేవించే అలవాటు ఉందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై పోటీకి దిగుతానని ఆమె అనడం హాస్యాస్పదం అని ఎద్దేవా చేశారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.