: ఇన్ఫోసిస్ లో తగ్గుతోన్న ఎల్ఐసీ వాటా


ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ కంపెనీలో ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసి) వాటాను క్రమంగా తగ్గించుకుంటూ వస్తోంది. గత త్రైమాసికంలో (మార్చి 31 నాటికి) ఇన్ఫోసిస్ లో వాటాను 3.71 నుంచి 3.25 శాతానికి ఎల్.ఐ.సి తగ్గించుకుంది. వాటా విక్రయం మూలంగా రూ. 850 కోట్లు ఈ బీమా సంస్థ చేతికొచ్చాయి. మార్కెట్ పరిస్థితుల దృష్ట్యా జూన్ త్రైమాసికం నుంచి ఇన్ఫోసిస్ లో ఎల్ఐసీ వాటాను తగ్గించుకుంటూ వస్తోంది. జూన్ 30 నాటికి ఇన్ఫోసిస్ లో ఎల్ఐసీకి 6.72 శాతం వాటా ఉంది. శుక్రవారం నాడు ఇన్ఫోసిస్ షేరు 3,235.80 రూపాయల వద్ద ముగిసింది. ఇవాళ ఈ కంపెనీ తన నాలుగో త్రైమాసిక, వార్షిక ఆర్థిక ఫలితాలను ప్రకటించిన విషయం విదితమే.

  • Loading...

More Telugu News