: ఆఫ్ఘనిస్తాన్ లో మంత్రి కిడ్నాప్
ఆఫ్ఘనిస్తాన్ పబ్లిక్ వర్క్స్ శాఖకు చెందిన సహాయ మంత్రి కాబూల్ లో అపహరణకు గురయ్యారు. ఈ ఉదయం కారులో కార్యాలయానికి వెళ్తున్న మంత్రి అహ్మద్ షా వహీద్ ను ఐదుగురు సాయుధులు మార్గమధ్యంలో అడ్డుకున్నారు. కారులోంచి అహ్మద్ షాను బయటకు లాగి తమ వాహనంలో ఎక్కించుకుపోయారు. దుండగులను చూసిన కారు డ్రైవర్ వేగం పెంచి మంత్రిని రక్షించేందుకు ప్రయత్నించగా... అతన్ని గాయపరిచి మంత్రిని లాక్కెళ్లారని పోలీసులు తెలిపారు. కాగా ఈ ఘటనకు బాధ్యులు ఎవరన్నది ఇంకా తెలియలేదు.