: జైలు నుంచి వచ్చిన వారు పోటీ చేస్తేనే లేనిది పొట్లూరి చేస్తే తప్పా?: పవన్ కల్యాణ్
తెలుగుదేశం పార్టీ టికెట్ల విషయంలో తాను కలగజేసుకోనని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. పొట్లూరి వరప్రసాద్ చాలా మంచి వ్యక్తి అని... అతనికి సీబీఐ క్లీన్ చిట్ కూడా ఇచ్చిందని అన్నారు. జైలు నుంచి వచ్చిన వారే ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పుడు పొట్లూరి పోటీ చేయడంలో తప్పేంటని ప్రశ్నించారు. మల్కాజిగిరి నియోజకవర్గంలో లోక్ సత్తా అధ్యక్షుడు జేపీ తరపున ప్రచారం చేస్తానని తెలిపారు. జేపీ కోసమే మల్కాజిగిరి నుంచి పోటీ చేయాలన్న ఆలోచనను విరమించుకున్నానని పవన్ తెలిపారు.