: సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన శ్రీనివాసన్


బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి తనను తప్పిస్తూ ఇచ్చిన తాత్కాలిక ఉత్తర్వులను పునః పరిశీలించాలని కోరారు. తనపై ఎలాంటి ఆరోపణలు రుజువు కాలేదని, అలాంటప్పుడు తనను అధ్యక్ష పదవి నుంచి ఎందుకు తప్పించారో తెలియదంటూ అందులో పేర్కొన్నారు. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ స్కాంలో విచారణ పారదర్శకంగా జరగాలంటే బీసీసీఐ పదవి నుంచి తప్పుకోవాలంటూ సుప్రీం సూచించడంతో శ్రీని తప్పుకోవాల్సి వచ్చింది. తాత్కాలిక అధ్యక్షుడిగా ఐపీఎల్ వ్యవహారాలు చూసుకునేందుకు సునీల్ గవాస్కర్ ను కోర్టు నియమించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News