: పోటీకి దిగుతున్న బైరెడ్డి కుమార్తె శబరి
రాయలసీమ పరిరక్షణ సమితి తరపున బైరెడ్డి రాజశేఖరరెడ్డి కుమార్తె శబరి ఎన్నికల్లో పోటీకి దిగుతోంది. ఈ మేరకు కర్నూలులోని పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి రాయలసీమకు జరిగిన అన్యాయాన్ని, పార్టీ ఏం చేయబోతుందనే విషయాలను ప్రజలకు వివరిస్తోంది. అంతేగాక పార్టీ తరపున కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల నుంచి అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఓ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తండ్రి బైరెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లడంతో పార్టీ బాధ్యతలను కుమార్తె శబరే చూసుకుంటున్నారు.