: సీమాంధ్ర ఉద్యోగులు ఆంధ్రలోనే పనిచేయాలి: కేకే


దళిత ముఖ్యమంత్రి అంశాన్ని టీఆర్ఎస్ పక్కన పెట్టలేదని ఆ పార్టీ జనరల్ సెక్రటరీ కే.కేశవరావు (కేకే) స్పష్టం చేశారు. హైదరాబాదులో ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తిని సీఎం చేస్తామని తెలిపారు. కేంద్రంలో ఎవరికి మద్దతు ఇవ్వాలనే అంశంపై ఇంకా తమ పార్టీ నిర్ణయం తీసుకోలేదని అన్నారు. విభజన నేపథ్యంలో తెలంగాణ ప్రాంతంలో పనిచేస్తున్న సీమాంధ్ర ఉద్యోగులంతా ఆంధ్రప్రదేశ్ లోనే పనిచేయాలని కేకే అభిప్రాయపడ్డారు.

గతంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అయితే దళిత కులానికి చెందిన వ్యక్తిని సీఎం చేస్తానని కేసీఆర్ వెల్లడించారు. అయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయిన తర్వాత ఆ అంశాన్ని కేసీఆర్ విస్మరించారు. ఈ నేపథ్యంలో మాట తప్పారంటూ కేసీఆర్ పై తెలంగాణలోని వివిధ రాజకీయ పక్షాలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీలకు మద్దతు ఇవ్వమని, థర్డ్ ఫ్రంట్ కు మద్దతు ఇస్తామని కేసీఆర్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News