: కేసీఆర్... ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పు: పొన్నాల సవాల్


టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య విరుచుకుపడ్డారు. పొన్నాల రోజుకోసారి కేసీఆర్ ను నిలదీస్తున్నారు. కడిగేస్తున్నారు. సవాళ్లు విసురుతున్నారు. తాజాగా ఆయన హైదరాబాదులో మాట్లాడుతూ, కేసీఆర్ పార్టీ సీట్లు అమ్ముకున్న విషయం నిజం కాదా? అని ప్రశ్నించారు. తెలంగాణ ఇస్తే విలీనం చేస్తానన్నది నిజం కాదా? అని ఆయనను పొన్నాల నిలదీశారు. అవకాశ వాదంతో కేంద్రంలో మంత్రి పదవి తీసుకున్నది నిజం కాదా? అని కడిగేశారు. మహాకూటమి అంటూ టీడీపీతో పొత్తు పెట్టుకుని బీజేపీతో మంతనాలు చేసింది నువ్వు కాదా? అని పొన్నాల గుర్తు చేశారు. ఎన్నికల తరువాత యూపీఏలోకి టీఆర్ఎస్ వస్తానంటే అప్పుడు పరిశీలిస్తామని పొన్నాల తెలిపారు.

  • Loading...

More Telugu News