: అధికారంలోకి వస్తే జగన్ తిన్న లక్ష కోట్లు కక్కిస్తాం: లోకేష్
టీడీపీ అధికారంలోకి వస్తే వైఎస్సార్సీపీ అధినేత జగన్ తిన్న లక్ష కోట్ల రూపాయలను కక్కిస్తామని టీడీపీ యువనేత నారా లోకేష్ స్పష్టం చేశారు. యువ ప్రభంజనం యాత్ర సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జగన్ దోచుకున్న సొమ్ము రైతు రుణమాఫీకి సరిపోతుందని అన్నారు. జగన్ తొలి 4 సంతకాల ప్రచారాన్ని ప్రజలు నమ్మడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. 4 సంతకాలతో జగన్ మరింత దోచుకుంటాడని ఆయన విమర్శించారు. 40 ఏళ్ల అనుభవమున్న చంద్రబాబు నాయుడు సమర్థవంతంగా పరిపాలిస్తాడా? ఏ అనుభవం లేని జగన్ పరిపాలిస్తాడా? అని ఆయన ప్రశ్నించారు.