: బీజేపీ కొత్త జట్టు.. పార్లమెంటరీ బోర్డులోకి మోడీ


బీజేపీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ తన జట్టును ప్రకటించారు. 2014 ఎన్నికలలో పార్టీని నడిపించేందుకు కొత్తవారితో నూతన పార్లమెంటరీ బోర్డును రాజ్ నాథ్  సింగ్ ప్రకటించారు. ప్రధాన మంత్రి పదవికి కీలక అభ్యర్థిగా భావిస్తున్న నరేంద్రమోడీని పార్లమెంటరీ బోర్డులోకి తీసుకున్నారు. మేనకా, సంజయ్ గాంధీల కుమారుడు వరుణ్ గాంధీ బీజేపీ జాతీయ జనరల్ సెక్రటరీగా నియమితులయ్యారు.

ఈయనతోపాటు రాజీవ్ ప్రతాప్ రూడీ, అమిత్ షా ను కూడా జనరల్ సెక్రటరీలుగా రాజ్ నాథ్ నియమించారు.  తెలుగువాడైన మురళీధర్ రావు కూడా బీజేపీ జనరల్ సెక్రటరీగా ఎంపికయ్యారు. ఈయన కరీంనగర్ జిల్లాకు చెందినవారు. బీజేపీ ఉపాధ్యక్షులుగా ముక్తార్ అబ్బాస్ నక్వీ, ఉమాభారతి, స్మృతి ఇరానీ నియమితులయ్యారు.

అయితే, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు మాత్రం పార్లమెంటరీ బోర్డులో చోటు లభించలేదు. నూతన పార్లమెంటరీ బోర్డ్ జాబితాపై సీనియర్ నేత అద్వానీతో చర్చించాకే రాజ్ నాథ్ తుదిరూపం ఇచ్చారు.

  • Loading...

More Telugu News