: సోనియా ఆస్తులు 9.28 కోట్లేనట... మేనకా గాంధీ ఆస్తులు 40 కోట్లు


ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తన ఆస్తులు 9.28 కోట్ల రూపాయలుగా పేర్కొనగా, ఆమె తోడి కోడలు బీజేపీ ఎంపీ మేనకా గాంధీ తన ఆస్తిని 40 కోట్ల రూపాయలుగా ఎన్నికల అఫిడవిట్ లో చూపించారు. ఉత్తరప్రదేశ్ లోని ఫిలిబిత్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ సీనియర్ నేత మేనకా గాంధీ స్థిరాస్తులు 24.95 కోట్లు కాగా, చరాస్తులు 12.46 కోట్ల రూపాయలుగా పేర్కొన్నారు. 40 వేల విలువ చేసే లైసెన్స్ డ్ రైఫిల్ ను కూడా ఆస్తుల జాబితాలో పేర్కొన్నారు.

1.47 కోట్ల విలువ చేసే బంగారు, వెండి అభరణాలు ఉండగా, బ్యాంకు ఖాతాలో 6 కోట్ల రూపాయలు ఉన్నట్టు ఆమె తెలిపారు. మేనకాగాంధీ ప్రస్తుతం సంజయ్ గాంధీ జంతు పరిరక్షణ కేంద్రం చైర్ పర్సన్. ఆమె పేరు మీద కారు, ఇతర వాహనాలు లేవు. ఆస్తులతో పాటు తనపై ఉన్న కేసుల వివరాలను కూడా ఆమె అఫిడవిట్లో పేర్కొన్నారు. ఏప్రిల్ 17న ఫిలిబిత్ లో పోలింగ్ జరుగనుంది.

  • Loading...

More Telugu News