: సీమాంధ్ర పునర్నిర్మాణం చంద్రబాబుతోనే సాధ్యం: మాగుంట
టీడీపీ అధినేత చంద్రబాబు ద్వారానే సీమాంధ్ర పునర్నిర్మాణం సాధ్యమని మాగుంట శ్రీనివాసులురెడ్డి అన్నారు. హైదరాబాదులో ఇవాళ చంద్రబాబు సమక్షంలో మాగుంట టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత రాజకీయాల్లో ఉండాలా? వద్దా? అని సందిగ్ధంలో పడ్డానని, ఆ సమయంలో చంద్రబాబు పార్టీలోకి ఆహ్వానించారని తెలిపారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో పోటీ చేయాలని చంద్రబాబు సూచించారని ఆయన చెప్పారు.