: హృతిక్ రోషన్ ను ఇబ్బందిపెడుతున్న ఆరోగ్య సమస్యలు!
నటుడు హృతిక్ రోషన్ ను ఏదోఒక ఆరోగ్య సమస్య తరచూ ఇబ్బంది పెడుతూనే ఉంది. తాజాగా ఆయన్ను కీళ్లకు సంబంధించిన నొప్పులు తీవ్రంగా వేధిస్తున్నాయి. వాటిపై ఈ డాన్సింగ్ స్టార్ ట్విట్టర్ లో చెబుతూ, 'కీళ్ల నొప్పులకు ఏదైనా పరిష్కారం మీ వద్ద ఉందా? వాటితో నా జీవితాంతం పోరాటం చేస్తూనే ఉంటా. దానికి ట్విట్టరే సమాధానం చెబుతుంది' తెలిపాడు. గతేడాది బ్రెయిన్ సర్జరీ చేయించుకున్న హృతిక్.. ప్రస్తుతం నటిస్తున్న 'బ్యాంగ్ బ్యాంగ్' సినిమా షూటింగులో తీవ్రంగా గాయపడ్డాడు.