: టీఆర్ఎస్ కు 20 సీట్లు మించవ్: కాకా
వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు 20కి మించి సీట్లు రావని కాంగ్రెస్ సీనియర్ నేత జి.వెంకటస్వామి (కాకా) జోస్యం చెప్పారు. ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో కాకా మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానని చెప్పి కేసీఆర్ మాట తప్పాడన్నారు. దళితుడిని తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి... ఇప్పుడు సీఎం సీటు కోసం కేసీఆర్ ఆరాటపడడంతో ఆయనపై ప్రజలకు విశ్వసనీయత తగ్గిందని ఆయన అన్నారు. ఫలితంగా టీఆర్ఎస్ కు ఈసారి సీట్లు తగ్గుతాయని ఆయన చెప్పారు. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.