: గౌలిగూడ నుంచి ఘనంగా ప్రారంభమైన హనుమాన్ శోభాయాత్ర


హైదరాబాదులోని గౌలిగూడ రామమందిరం నుంచి హనుమాన్ శోభాయాత్ర వైభవోపేతంగా ప్రారంభమైంది. ఇవాళ హనుమాన్ జయంతి సందర్భంగా, భజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ ఊరేగింపు భక్తుల కోలాహలం, డప్పు వాయిద్యాల మధ్య సాగుతోంది. సికింద్రాబాదు తాడ్ బండ్ హనుమాన్ దేవాలయం వరకు సుమారు 12 కిలోమీటర్ల వరకు ఈ యాత్ర కొనసాగుతుంది. కోఠి, రామ్ కోఠి, నారాయణగూడ, ఆర్టీసీ క్రాస్ రోడ్, ప్యారడైజ్ సర్కిల్ మీదుగా సాగే ఈ శోభాయాత్రలో వేలాదిమంది భక్తులు పాల్గొంటున్నారు. ఈ శోభాయాత్రకు 6 వేల మంది పోలీసులతో కట్టుదట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

  • Loading...

More Telugu News