: సినీ ఫంక్షన్లకు కూడా వెళ్లని నేను మోడీ కోసం వచ్చా: పవన్ కల్యాణ్
కష్టం నష్టం తెలిసిన మోడీ లాంటి నేత దేశానికి కావాలని పవన్ కల్యాణ్ ఆకాంక్ష వ్యక్తం చేశారు. కర్ణాటకలోని కోలార్ లో ఆయన మాట్లాడుతూ, సినిమా ఫంక్షన్లకు కూడా వెళ్లని తాను మోడీని ప్రధానిని చేసేందుకు ప్రచారం చేస్తున్నానని అన్నారు. మంచి సిద్ధాంతాల కోసం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నడుస్తానని తెలిపారు. ఓటమితో ప్రపంచం నాశనం కాదని, ఓడినా, గెలిచినా నాయకుడనేవాడు మొండిగా ముందుకే సాగాలని పవన్ కల్యాణ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసాన్ని పొందలేకపోయిందని, నమ్మకాన్ని నిలబెట్టలేకపోయిందని ఆయన మండిపడ్డారు. తాను కాశ్మీర్ మొదలుకొని కన్యాకుమారి వరకు ఉన్న సమస్యలపై నేతలను నిలదీస్తానని అన్నారు.