: ‘జై హనుమాన్’ నినాదాలతో మార్మోగిన ఆలయాలు


హైదరాబాదు నగరంలో హనుమాన్ జయంతి పర్వదినాన్ని ఘనంగా జరుపుకొంటున్నారు. ఈరోజు తెల్లవారుజాము నుంచే హనుమాన్ మందిరాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. యువతీ యువకులు ఇవాళ నగరంలోని పలు ప్రాంతాల్లో కాషాయజెండాలు చేతబూని ‘జై శ్రీరామ్’, ‘జై హనుమాన్’ నినాదాలతో బైక్ ర్యాలీ నిర్వహించారు. హైదరాబాదులో ఇవాళ జరుగనున్న హనుమాన్ యాత్రకు సర్వం సిద్ధమైంది. గౌలిగూడ రామాలయం నుంచి సికింద్రాబాదు తాడ్ బండ్ ఆంజనేయుని ఆలయం వరకు భారీ ఊరేగింపుతో యాత్ర కొనసాగుతుంది. ముందు జాగ్రత్తగా ఆరు వేల మంది పోలీసులతో గట్టి భద్రతా ఏర్పాట్లు చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ తెలిపారు.

  • Loading...

More Telugu News