: నిర్దాక్షిణ్యంగా ప్రాణాలు తీసేసి, క్షమాపణలు కోరుతున్న మావోలు!


మావోయిస్టుల తీరుపై మానవహక్కుల సంఘాలు, మానవత్వమున్న మనుషులు విరుచుకుపడుతున్నారు. సిద్ధాంత విభేదాలా? లేక వ్యక్తిగత కక్షలా? అంటూ సూటిగా ప్రశ్నిస్తున్నారు. సిద్ధాంత విభేదాలు ఉంటే యుద్ధం చేయాల్సిన విధానమిదేనా? అంటూ విరుచుకుపడుతున్నారు. ఎన్నికల విధులకు వెళ్తున్న ఏడుగురు సిబ్బందిని నిర్దాక్షిణ్యంగా చంపేసిన మావోయిస్టులు రెండు పేజీల బహిరంగ లేఖతో క్షమాపణలు కోరారు. దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ బహిరంగ క్షమాపణలు కోరింది. భద్రతా సిబ్బంది అనుకుని పోరపాటున మందుపాతర పేల్చినట్టు తెలిపింది. చనిపోయిన వారంతా బస్తర్ వాసులే అవడంతో మావోయిస్టుల చర్య పట్ల ఆదివాసీల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

'వారు మాకు శత్రువులు కారు. వారికీ, మాకు ఎలాంటి విరోధమూ లేదు. ఈ లోటు పూడ్చలేనిది. ఏం చేసినా పోయిన ప్రాణాలను తీసుకురాలేము' అని మావోయిస్టులు పేర్కొన్నారు. దీనిపై స్థానికులు మానవ హక్కుల సంఘాలను ప్రశ్నిస్తున్నారు. మావోయిస్టులు ఎన్ కౌంటర్లలో చనిపోతే వారికి ఉద్యోగాలు, ఉపాధి, భృతి, పరిహారం అంటూ హడావుడి చేసే మేధావులు దీనిపై ఏం సమాధానం చెబుతారని, మావోయిస్టుల నుంచి ఏ పరిహారం రాబడతారని సూటిగా అడుగుతున్నారు.

  • Loading...

More Telugu News