: విశాల ప్రయోజనాల దృష్ట్యానే టీడీపీతో పొత్తు: వెంకయ్యనాయుడు
రానున్న ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ పొత్తుపై పలు విమర్శలు వినపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, దేశ, రాష్ట్ర విశాల ప్రయోజనాల దృష్ట్యానే టీడీపీతో పొత్తు పెట్టుకున్నామని తెలిపారు. దాంతో, కేంద్రంలో ఎన్డీఏ, రాష్ట్రంలో టీడీపీ-బీజేపీ విజయం తథ్యమన్నారు. ఎన్డీఏకు మూడు వందల లోక్ సభ స్థానాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఇక మూడో కూటమిపై వెంకయ్య తీవ్ర ఆరోపణలు చేశారు. థర్డ్ ఫ్రంట్ అనేది అతుకుల బొంత అని, దానిపై కొందరు చేస్తున్న ప్రచారాన్ని నమ్మవద్దని సూచించారు. గతంలో మూడో ఫ్రంట్ ప్రయత్నాలు మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలాయన్నారు.