: మహిళా ప్రపంచకప్ లో పాక్ పై భారత్ గెలుపు


మహిళా ప్రపంచకప్ లో భాగంగా భారత్, పాక్ మధ్య కటక్ వేదికగా ఈ రోజు జరిగిన మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది. ఈ గెలుపుతో టీమిండియా జట్టు మహిళా ప్రపంచకప్ లో ఏడో స్థానంలో నిలిచింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన భారత జట్టు 193 పరుగులు చేసి 46 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లే కోల్పోయింది. 103 పరుగులతో నాటౌట్ గా నిలిచిన కెప్టెన్ మిథాలీ రాజ్ తన సెంచరీతో జట్టును విజయ స్థానంలో నిలబెట్టారు. ఇప్పటికే సూపర్ సిక్స్ లో స్థానం కోల్పోయిన భారత్ ఈ విజయంతో ఏడో స్థానాన్ని దక్కించుకోగలిగింది.  

  • Loading...

More Telugu News