: ఐపీఎస్ ల విభజనపై నేడు కీలక సమావేశం
రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రంలోని ఐపీఎస్ అధికారులను రెండు రాష్ట్రాలకు కేటాయించే విషయమై ఈ రోజు కీలక సమావేశం జరగనుంది. ఢిల్లీలో కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సమావేశంలో పాల్గొనడానికి రాష్ట్రం నుంచి పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులు వెళుతున్నారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాలకు చెందిన వారిని వారి రాష్ట్రాలకు కేటాయించి... ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన అధికారులకు మాత్రం ఆప్షన్ ఇవ్వాలనే డిమాండ్ ఉంది. అంతేకాకుండా, ఐపీఎస్ అనేది అఖిలభారత సర్వీసు కాబట్టి ఎవరికి ఎలాంటి ఆప్షన్లు ఇవ్వకుండా, ఏయే రాష్ట్రానికి ఎవరెవరిని కేటాయించాలనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వమే నిర్ణయించాలనే సూచన కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు జరగనున్న సమావేశం అత్యంత కీలకం కానుంది.